
గూడూరు, జూన్ 28: గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి తిరుచ్చి ఉత్సవం పట్టణ వీధుల్లో వైభవంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంటి రామమోహన్‌రావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ ఉత్సవాలకు ఉభయ దాతలుగా శ్రీమతి రాధారాణి జ్ఞాపకార్థం గొట్టిపాలు రామసుబ్బారెడ్డి దంపతులు వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.












