మన్నెగుంటలో ఉచిత న్యూరాలజీ వైద్య శిబిరం

చిల్లకూరు, జూన్ 28: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ సహకారంతో చిల్లకూరు మండలం మన్నెగుంట గ్రామంలో ఆదివారం ఉచిత న్యూరాలజీ వైద్య శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ మాట్లాడుతూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు నరాల సంబంధిత వ్యాధులపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మూర్చ వ్యాధి, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి వ్యాధుల లక్షణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు.శిబిరంలో 120 మంది నరాల సంబంధిత వ్యాధిగ్రస్తులను పరీక్షించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు అక్కన రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.ఆర్. లయన్ శ్రీ గిరినాథ్, లయన్ మల్లెమాల మురళిరెడ్డి, వాకాటి రామ్మోహన్, మదనమేటి రమణయ్య, జక్కంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మనుబోలు రూపేష్ రెడ్డి, వీరేంద్రనాథ్, కళ్యాణ్ సాయి, అడ్వకేట్ లయన్ రజనీకాంత్ రెడ్డి, మహేష్, కె. శివయ్య, చింతల రాఘవయ్య, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.ఈ శిబిరానికి క్యాంప్ చైర్మన్‌గా లయన్ బ్రహ్మదేవి సీనయ్య, ఆర్గనైజర్‌గా మన్నెగుంట గ్రామానికి చెందిన తిప్పరాజు శ్రీనివాసులు వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం గ్రామంలో డాక్టర్ బిందు మీనన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

error: Content is protected !!
Prajaveek Shanam