
గూడూరు, జూన్ 28: రీహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబుల్డ్ (రెడ్) సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గూడూరు పట్టణంలో 100 మందికి అల్పాహారం పంపిణీ చేశారు.గూడూరు జడ్పీటీసీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా ఉపాధ్యక్షురాలు ఊటుకూరు యామిని మహేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అవసరమైన వారికి అల్పాహారం అందజేసి జన్మదిన వేడుకలను సేవా దృక్పథంతో నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్ సంస్థ సభ్యులు అస్లాం, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.












