చిల్లకూరులో ఘనంగా రొట్టెల పండుగ

చిల్లకూరు, జూన్ 28: చిల్లకూరు గ్రామంలోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా, శ్రీ సయ్యద్ మహమ్మద్ షా దోషహిత్ దర్గా వద్ద ఆదివారం రొట్టెల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్గాకు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమ మొక్కులు తీర్చుకుని, పరస్పరం రొట్టెలు మార్చుకుని ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
పండుగ సందర్భంగా దర్గా నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక అధికారులు, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు.

error: Content is protected !!
Prajaveek Shanam