
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిల్లకూరు మండలం పున్నెపువారిపాలెం గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హెలిప్యాడ్ వద్ద గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యక్రమ స్థలానికి చేరుకుని ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












