
కందుకూరు: కందుకూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్గా రాయపాటి సుభాషిణి, 15 మంది డైరెక్టర్లతో కలిసి ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్ర పార్టీ కార్యదర్శి, కందుకూరు నియోజకవర్గ పరిశీలకురాలు మట్టం శ్రావణి రెడ్డి కార్యక్రమంలో పాల్గొని నూతన చైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, మార్కెట్ కమిటీల ద్వారా మెరుగైన సేవలు అందించడం ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ రాయపాటి సుభాషిణి, డైరెక్టర్లు రైతుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసి, కందుకూరు ఏఎంసీని రాష్ట్రంలో ఆదర్శ మార్కెట్ కమిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (ఎంఎల్సీ), నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ముక్క ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామంచర్ల జనార్ధన్, నెల్లూరు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సీనియర్ నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు













