–జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్‌కు నూతనంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షుడు పి. బాలకృష్ణ గౌడ్, కార్య నిర్వాహక కార్యదర్శి డబ్బు కృపానిధికు గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో బుధవారం గూడూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు శ్రేయోభిలాషులు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కు నూతనంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులను ఘనంగా శాలువాలతో సత్కరించి, పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే జమాల్ బాషా, డివిజన్ ఏపీఎంఎఫ్ అధ్యక్షులు ఆత్మకూరు సురేష్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన యూనియన్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కు గూడూరు నుండి సీనియర్ పాత్రికేయ మిత్రులకు జిల్లా కమిటీలో పదవులు దక్కడం అందరికీ సంతోషదాయకమన్నారు. అదేవిధంగాపాత్రికేయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, మీడియా రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాత దర్శిని జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పి. బాలకృష్ణ గౌడ్, కార్యనిర్వహక కార్యదర్శి, ప్రభా న్యూస్ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి డబ్బు కృపానిధి లు మాట్లాడుతూ జిల్లాలో అనేకమంది జర్నలిస్టులు ఉన్నా గూడూరు నుండి జిల్లా కమిటీలో తమకు బాధ్యతలు అప్పగించేందుకు సహకరించిన గూడూరు డివిజన్ ఏపీఎంఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు ఆత్మకూరు సురేష్, సి హెచ్ అనిల్ లతో పాటు సహకరించిన మీడియా మిత్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ ఏపీ ఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనీల్ ,గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎం కోటేశ్వరరావు, సిహెచ్ నిరంజన్, నరసింహారావు, విజయ్, చెన్నూరు మస్తాన్ రావు, ఇమ్రాన్,













