
(గూడూరు) జూలై 23:
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంను ఈ నెల 27వ తేదీ నుంచి విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని గూడూరు శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.గూడూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను వివరించి, వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, ప్రతి ఇంటిని సందర్శించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం విజయవంతమయ్యేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, బాధ్యతలను కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












