మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది: గుండాల లీలావతి


చిల్లకూరు మండలం, ఓడూరు, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశం విద్యార్థుల విద్యాభివృద్ధికి, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయానికి దోహదపడే అద్భుతమైన కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గుండాల లీలావతి అన్నారు.గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పెంచలకోన మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ సూచనలతో, మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి మార్గదర్శకత్వంలో శుక్రవారం ఓడూరు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు, ఎన్నికల హామీ మేరకు ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం కింద సన్నబియ్యంతో నాణ్యమైన, రుచికరమైన భోజనం విద్యార్థులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల విద్యా పురోగతిపై తల్లిదండ్రులు నిరంతరం ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరుపుతూ, పిల్లల అభ్యాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు కూడా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని గుండాల లీలావతి సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam