మన్నెముత్తేరిలో పేకాట శిబిరంపై దాడి – 6 మంది అరెస్ట్, రూ.19,000 నగదు, 3 బైక్‌లు స్వాధీనం

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జీ. చెంచుబాబు ఆధ్వర్యంలో, సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో సూళ్ళూరుపేట సబ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం మన్నెముత్తేరి గ్రామంలో అక్రమ గ్యాంబ్లింగ్ (పేకాట) స్థావరంపై దాడి చేసింది. పక్కా సమాచారంతో నిర్వహించిన ఈ దాడిలో గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్న 6 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి రూ. 19,000/- నగదు మరియు 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మెరుపు దాడిలో ఎస్సై అజయ్ కుమార్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు శ్రీరామ్ సత్యనారాయణ, మధు, కానిస్టేబుల్ కుప్పారావు, హోమ్ గార్డులు కిరణ్, వీరయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్సై అజయ్ కుమార్ మాట్లాడుతూ… “మండల పరిధిలో ఎలాంటి అక్రమ జూదం, పేకాట, గుట్కా, మద్యం విక్రయాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరైనా ఇలాంటి అక్రమాల సమాచారం ఇస్తే వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం,” అని హెచ్చరించారు. చాకచక్యంగా దాడి నిర్వహించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

error: Content is protected !!
Prajaveek Shanam