క్రాంతికి హార్దిక్‌ ప్రత్యేక కానుక

బెంగళూరు, ఆగస్టు 18 (ప్రజా వీక్షణం ) :

భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్‌ క్రాంతి గౌడ్‌కు తన అభిమాన క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా నుంచి ప్రత్యేక కానుక లభించింది. తన పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం బెంగళూరులో క్రాంతికి 33వ నంబర్‌ జెర్సీని పాండ్యా బహూకరించాడు. తాను స్ఫూర్తిగా భావించే ఆటగాడి నుంచి పుట్టినరోజు కానుకగా జెర్సీ అందుకోవడంతో క్రాంతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అభిమాన ఆటగాడి నుంచి కానుక
ఇటీవల ఇంగ్లండ్‌పై సంచలన ప్రదర్శనతో క్రికెట్‌ వర్గాల దృష్టిని ఆకర్షించిన క్రాంతి గౌడ్‌.. తన పుట్టినరోజు సందర్భంగా హార్దిక్‌ పాండ్యా నుంచి జెర్సీ అందుకుంది. తన అభిమాన క్రికెటర్‌ ప్రత్యేకంగా జెర్సీని అందించిన విషయాన్ని క్రాంతి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. పాండ్యా చేతుల మీదుగా జెర్సీ అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

error: Content is protected !!
Prajaveek Shanam