బంతికి రూ.3 లక్షలు.. ఫెరీరా రికార్డు

లండన్, ఆగస్టు 18 (ప్రజా వీక్షణం ) 

పొట్టి ఫార్మాట్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. తాజాగా దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డోనోవన్ ఫెరీరాకు కూడా ఇదే స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇంగ్లాండ్‌లో జరిగిన టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన అతడిని 2026 హండ్రెడ్ సీజన్ కోసం బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏకంగా రూ.2,71,76,436 చెల్లించి జట్టులోకి తీసుకోవడమే కాకుండా కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది.భారీగా పెరిగిన పారితోషికం
2025లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు ఫెరీరాకు 52 వేల పౌండ్లు చెల్లించింది. అప్పట్లో అతడు ఎదుర్కొన్న ఒక్కో బంతికి సుమారు రూ.89,294 చొప్పున ఆదాయం లభించింది. అయితే 2026లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు చెల్లించిన భారీ మొత్తంతో ఈ ఆదాయం మరింత పెరిగింది.ఒక్కో బంతికి లక్షల్లో ఆదాయం
కెప్టెన్‌గా ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఫెరీరా 90 బంతులు ఎదుర్కొని 101 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 40 బంతులు కూడా వేశాడు. బ్యాటింగ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఈ సీజన్‌లో అతడు ఎదుర్కొన్న ఒక్కో బంతికి ఏకంగా రూ.3,01,960 చొప్పున ఆదాయం అందుకున్నాడు. లీగ్ క్రికెట్‌లో ఒక్కో బంతికి లక్షల్లో ఆదాయం పొందడం అరుదైన ఘనతగా నిలిచింది.

error: Content is protected !!
Prajaveek Shanam