
- ప్రపంచకప్ రెండో రౌండ్‌కు అర్హత
ఆమ్‌స్టెల్‌వీన్, ఆగస్టు 19 (ప్రజా వీక్షణం ): దాయాదుల పోరులో 5-3తో భారత్ విజయం
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌పై భారత్ అదరగొట్టింది. ఆమ్‌స్టెల్‌వీన్‌లోని వాగెనర్ స్టేడియంలో జరిగిన పూల్-డీ చివరి మ్యాచ్‌లో భారత్ 5-3తో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రపంచకప్ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.హర్మన్‌ప్రీత్, అభిషేక్ చెలరేగింపు
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ఐదో నిమిషంలోనే హర్మన్‌ప్రీత్ గోల్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. అనంతరం మరో గోల్ చేసి తన జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. అభిషేక్ కూడా రెండు గోల్స్ చేయడంతో భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించింది.పెనాల్టీ స్ట్రోక్‌తో హార్దిక్ గోల్
మూడో క్వార్టర్‌లో హార్దిక్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను అద్భుతంగా గోల్‌గా మలిచాడు. మరోవైపు పాకిస్థాన్ వరుసగా గోల్స్ చేసి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. నాలుగో క్వార్టర్‌లో మరో గోల్ చేసినా భారత్ ఆధిక్యాన్ని తగ్గించలేకపోయింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న టీమిండియా 5-3తో విజయాన్ని ఖరారు చేసింది.ఆరు పాయింట్లతో రెండో స్థానంలో భారత్
పూల్-డీలో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1తో గెలిచిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 2-4తో ఓడింది. పాకిస్థాన్‌పై విజయంతో రెండో రౌండ్‌కు చేరుకుంది. మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో తొమ్మిది పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది.టోర్నీలో ఐదు గోల్స్‌తో హర్మన్‌ప్రీత్
పాకిస్థాన్‌పై రెండు గోల్స్ సాధించడంతో హర్మన్‌ప్రీత్ సింగ్ టోర్నీలో తన గోల్స్ సంఖ్యను ఐదుకు పెంచుకున్నాడు. వేల్స్‌పై రెండు, ఇంగ్లండ్‌పై ఒకటి, పాకిస్థాన్‌పై రెండు గోల్స్ చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌తో భారత కెప్టెన్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.












