
హైదరాబాద్, ఆగస్టు 23 (ప్రజా వీక్షణం ):అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో దేశీయంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. శనివారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,090గా నమోదైంది. గత రోజుతో పోలిస్తే రూ.1,520 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,49,500కు చేరింది. నిన్నటితో పోల్చుకుంటే ఇది రూ.1,400 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ట్రెజరీ బాండ్ దిగుబడులు తగ్గడం, డాలర్ విలువ బలహీనపడటంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పైపైకి కదులుతున్నాయి.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,090గా, 22 క్యారెట్ల ధర రూ.1,49,500గా ఉంది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్లోనూ ఇదే ధరలు నమోదయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,240గా, 22 క్యారెట్ల ధర రూ.1,49,650గా ఉంది. అహ్మదాబాద్లో 24 క్యారెట్ల ధర రూ.1,63,140గా నమోదైంది.
బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది.












