
న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులోనూ పటిష్ఠ స్థితిలో ఉంది. వన్‌డౌన్‌లో దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో సెంచరీతో అదరగొట్టడంతో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.శ్రీలంక జట్టు చాలా బలహీనంగా ఉందని, ఆ జట్టుపై భారత్ సునాయాసంగా గెలుస్తుందని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. శ్రీలంక సిరీస్‌లో గంభీర్ పెద్దగా వ్యూహాలు రచించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశాడు. అఫ్ఘనిస్థాన్, శ్రీలంక వంటి చిన్న జట్లపై సిరీస్‌లు గెలిచినప్పుడు గంభీర్ ఎగిరి గంతేస్తాడంటూ సెటైర్లు వేశాడు.గాయపడిన సాయి సుదర్శన్ తిరిగి జట్టులోకి వస్తే దేవదత్ పడిక్కల్‌ను పక్కన పెడతారనే ప్రచారంపైనా శ్రీకాంత్ స్పందించాడు. రెండు టెస్టుల్లో కలిపి 200కు పైగా పరుగులు చేసిన ఆటగాడిని ఎలా తప్పిస్తారని ప్రశ్నించాడు. గంభీర్‌పై తనకు వ్యక్తిగత కక్ష లేదని, అతడికి క్రికెట్‌పై మంచి అవగాహన ఉందని చెప్పాడు. అయితే మీడియాతో మాట్లాడేటప్పుడు మరింత మెరుగ్గా మాట్లాడితే బాగుంటుందని సూచించాడు.












