లావా విరాట్‌ వీ1 ప్రో 5జీ విడుదల.. ధర రూ.15,999!

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ లావా కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. లావా విరాట్‌ వీ1 ప్రో 5జీ పేరుతో విడుదలైన ఈ ఫోన్‌ ధర రూ.15,999గా నిర్ణయించారు. బ్యాంక్‌ ఆఫర్లతో రూ.13,999కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఫోన్‌ ఒక్క వేరియంట్‌లోనే లభిస్తుంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ ఇందులో ఉన్నాయి. సిక్కిం మిడ్‌నైట్‌, స్పితి ఫ్రాస్ట్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్‌ రేట్‌ ఉంది. 2.6GHz గరిష్ఠ వేగంతో పనిచేసే యూనిసాక్‌ టీ8200 ఆక్టాకోర్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందించారు.
ఫోన్‌ వెనుక డ్యూయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 50ఎంపీ ఏఐ ప్రధాన కెమెరా, 8ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉన్నాయి. 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఐపీ64 రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుందని కంపెనీ తెలిపింది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 5, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సి, జీపీఎస్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. సైడ్‌-మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ను కూడా అందించారు.

error: Content is protected !!
Prajaveek Shanam