
మేడ్చల్-మల్కాజిగిరి: ప్రజా వీక్షణం ఆగస్టు 25
ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొండాపూర్ విజ్ఞాన్ కళాశాల సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన మహీంద్రా కారు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థులు, నలుగురు పెయింటింగ్ పనులు చేసే కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం అనంతరం కారును సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వదిలేసి డ్రైవర్ పరారైనట్లు సమాచారం.ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, డ్రైవర్ ఆచూకీ తెలియాల్సి ఉంది.












