ఏడాదికి పైగా రీఛార్జ్‌ అవసరం లేదు!

న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ప్రజా వీక్షణంప్రతినిధి): ప్రతి నెలా రీఛార్జ్‌ చేసుకునే ఇబ్బందిని తగ్గించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ దీర్ఘకాలిక రీఛార్జ్‌ ప్లాన్‌ను అందిస్తోంది. ఏకంగా 412 రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌, రోజుకు 100 సందేశాల ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్లాన్‌ ధర రూ.2,399గా ఉంది.
రోజుకు 2 జీబీ డేటా
ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌, సామాజిక మాధ్యమాలు, వీడియోలు, ఇతర రోజువారీ అవసరాలకు ఈ డేటాను వినియోగించుకోవచ్చు.
అపరిమిత కాల్స్‌.. 100 సందేశాలు
డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉంది. రోజుకు 100 సందేశాలు కూడా ఉచితంగా పంపుకోవచ్చు.
365 రోజులకు బదులు 412 రోజులు
సాధారణంగా చాలా సంస్థలు 365 రోజుల కాలపరిమితితో రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్‌ 412 రోజుల కాలపరిమితిని అందిస్తోంది. అంటే సాధారణ వార్షిక ప్లాన్‌తో పోలిస్తే అదనంగా 47 రోజుల ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్లాన్‌ను రూ.2,399తో పొందవచ్చు. అయితే ఈ ప్రత్యేక ప్రయోజనం సెప్టెంబర్‌ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం.
రూ.1కే కొత్త సిమ్‌ ఆఫర్‌
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్‌ కొత్త వినియోగదారుల కోసం మరో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో కేవలం రూ.1కే కొత్త సిమ్‌ కార్డు పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌ కింద రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌, రోజుకు 100 సందేశాలు లభిస్తాయి.
ఆగస్టు 30 వరకు అవకాశం
రూ.1 సిమ్‌ కార్డు ఆఫర్‌ కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రత్యేక ప్రయోజనం ఆగస్టు 30 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆ తర్వాత ఈ ఆఫర్‌ ముగిసే అవకాశం ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam