బంగారం.. వెండి ధరలకు భారీ పతనం!

హైదరాబాద్, ఆగస్టు 28 (ప్రజా వీక్షణం ప్రతినిధి): బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు శుక్రవారం ఒక్కసారిగా దిగొచ్చాయి. ఉదయం 11 గంటల సమయానికి గుడ్‌రిటర్న్స్‌ ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,160 తగ్గి రూ.1,59,820కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.2,900 తగ్గి రూ.1,46,500గా నమోదైంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,870గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,60,000కు చేరుకుంది.
ప్రధాన నగరాల్లో ధరలు:
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి తదితర నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,820, 22 క్యారెట్ల ధర రూ.1,46,500గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

error: Content is protected !!
Prajaveek Shanam