హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా వీక్షణం ప్రతినిధి): బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,470, 22 క్యారెట్ల బంగారంపై రూ.1,350, 18 క్యారెట్ల బంగారంపై రూ.830 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరింత దిగివచ్చాయి.
ఉదయం 10 గంటల సమయంలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,770గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,700కు చేరగా.. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,850గా నమోదైంది.
తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ పట్టణాల్లోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,56,770గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,700గా, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,850గా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని కడప, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,56,770గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,43,700గా, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,850గా నమోదైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో స్వల్ప తేడాలతో ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,56,920గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,850గా ఉంది. చెన్నైలో 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,400గా నమోదైంది. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.1,56,770గా ఉంది.
వరుసగా రెండు రోజులుగా పసిడి ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది.












