న్యూఢిల్లీ, ఆగస్టు 31 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ప్రముఖ వేరబుల్స్ సంస్థ ఫైర్-బోల్ట్ తొలిసారిగా స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టింది. ‘బోల్ట్’ సిరీస్‌లో బోల్ట్ ఏస్ 5జీ, బోల్ట్ ఈవో 4జీ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ ధరలోనే అధునాతన ఫీచర్లను అందిస్తోంది.
120 హెర్ట్జ్ డిస్‌ప్లే
ఈ ఫోన్లలో 6.79 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ స్మూత్‌గా పనిచేసేలా రూపొందించారు. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి.
6,000 ఎంఏహెచ్ బ్యాటరీ
న్లలో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్ సదుపాయం ఉంది. బోల్ట్ ఏస్ 5జీలో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, బోల్ట్ ఈవో 4జీలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు.
రూ.9,999కే 5జీ ఫోన్
ఈ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర రూ.10,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్‌లో రూ.1,000 తక్షణ తగ్గింపు లభించడంతో రూ.9,999కే 5జీ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ధరలో 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు అందించడం విశేషం.












