గూడూరు ప్రజా వీక్షణం సెప్టెంబర్.01
గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో పశుపోషకులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పశుగ్రాసాన్ని 50 శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేశారు. పశువైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు మట్టం శ్రావణి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పశుగ్రాసాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పశుపోషకులకు పశువుల పోషణ, పశుగ్రాసం వినియోగం, పశువుల ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పశువులకు సరైన పోషకాహారం అందించడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పాల ఉత్పత్తిని మెరుగుపరుచుకోవచ్చని పశువైద్యులు సూచించారు.ప్రభుత్వం పశుపోషకులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించడం అభినందనీయమని మట్టం శ్రావణి రెడ్డి తెలిపారు. పశుపోషకులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పశుగ్రాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడుతున్న రైతులకు ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
పశువైద్యులు డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పశుపోషకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












