న్యూఢిల్లీ, సెప్టెంబర్ 01 (ప్రజా వీక్షణం ప్రతినిధి): దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు మంగళవారం స్వల్పంగా పెంచాయి. వివిధ నగరాల్లో ధరలు కొంతమేర పెరగ్గా.. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.9.50 పెంచారు. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.2,747.50కి చేరింది.చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.10.50 పెరిగింది. దీంతో అక్కడ సిలిండర్ ధర రూ.2,961కి చేరింది. కోల్‌కతాలో రూ.11.50 పెంచడంతో ధర రూ.2,884కి చేరింది. ముంబైలో సిలిండర్‌పై రూ.9.50 పెరగడంతో కొత్త ధర రూ.2,701గా ఉంది.
గతంలో భారీగా పెంపు
ఈ ఏడాది మే 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై చమురు సంస్థలు ఏకంగా రూ.993 పెంచాయి. అనంతరం ఆగస్టు 1న రూ.200 తగ్గించాయి. తాజాగా సెప్టెంబర్ 1న మరోసారి స్వల్పంగా ధరలను పెంచాయి.
గృహ వినియోగదారులకు ఊరట
కాగా, గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధరల పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది.












