టాక్సిక్’కు 0.5 స్టార్.. మహేశ్ బాబు కొడుకు రేటింగ్స్ వైరల్!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 01 (ప్రజా వీక్షణం ప్రతినిధి): టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఇచ్చిన సినిమా రేటింగ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ సినిమా రేటింగ్ వేదిక లెటర్‌బాక్స్‌డ్‌లో యశ్ నటించిన ‘టాక్సిక్’కు గౌతమ్ కేవలం 0.5 స్టార్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇతర స్టార్ హీరోల సినిమాలకు అతడు ఇచ్చిన రేటింగ్స్ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
తండ్రి సినిమాలకూ ఒకే రేటింగ్ కాదు!
గౌతమ్ తన తండ్రి మహేశ్ బాబు నటించిన ‘పోకిరి’, ‘1: నేనొక్కడినే’ చిత్రాలకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వగా.. ‘బ్రహ్మోత్సవం’కు కేవలం 1 స్టార్ ఇచ్చాడు. ‘నిజం’, ‘వంశీ’ సినిమాలకు 2 చొప్పున రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
‘బాహుబలి 2’కు 5.. ‘లైగర్’కు 0.5 స్టార్!
టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా, హాలీవుడ్ సినిమాలపై కూడా గౌతమ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘బాహుబలి 2’కు 5 స్టార్లు, ‘పెళ్లిచూపులు’, ‘సీతారామం’కు 4.5 రేటింగ్ ఇచ్చాడు. యశ్ ‘టాక్సిక్’తో పాటు విజయ్ దేవరకొండ ‘లైగర్’కు 0.5 స్టార్, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’కి 2.5 రేటింగ్ ఇచ్చాడు.
సినిమా నచ్చితే ఫుల్ మార్క్స్.. నచ్చకపోతే నో డౌట్!
గౌతమ్ లెటర్‌బాక్స్‌డ్ ప్రొఫైల్ ప్రకారం అతడు 400కు పైగా సినిమాలు వీక్షించినట్లు తెలుస్తోంది. సినిమా కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కంటెంట్ ఆధారంగానే రేటింగ్స్ ఇస్తున్నాడని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరికొందరు మాత్రం సెలబ్రిటీ కుటుంబ సభ్యుల బహిరంగ సినిమా రేటింగ్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam