-రక్తదానం.. అన్నదానం.. రోగులకు పండ్లు, రొట్టెల పంపిణీ
-ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయి : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ బూదూరు గురవయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు. తొలుత గూడూరు పట్టణంలోని బానిస్కపేటలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన నాయకులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక పీవీఆర్ ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు విశేషంగా స్పందించి పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన సాగించారని అన్నారు.

పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆరోగ్య రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయని అన్నారు. మహానేత వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, సంక్షేమ పాలన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. రక్తదానం చేసిన దాతలను కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందించారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో దోహదపడుతుందని, యువత సేవా కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ వర్ధంతిని కేవలం నివాళులకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించి పేదలు, నిరుపేదలకు భోజనాలు వడ్డించారు. వైఎస్సార్ చూపిన సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు అండగా నిలవాలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, యద్ధల నరేంద్రరెడ్డి, కోడూరు మీరారెడ్డి, వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, భక్తవత్సలరెడ్డి. మన్యం సీనయ్య, అట్ల శ్రీనివాసులరెడ్డి ,బత్తిని విజయకుమార్, మోగ్ధ్మం మొహిద్దిన్, మహేంద్ర ,రమణారెడ్డి , సుభాన్, మనుబోలు కిష్టయ్య, కొండగుంట భాస్కర్ రెడ్డి, కొట్టు గోవర్ధన్, బల్లి వెంకటేశ్వర్లు, కొండగుంట వెంకటేశ్వర్లు . పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు













