నేరాల నివారణే లక్ష్యంగా విస్తృత తనిఖీలు.. అనుమానాస్పద కదలికలపై నిఘా
బాపట్ల, సెప్టెంబర్ 2 (ప్రజా వీక్షణం ప్రతినిధి): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలు, ఖాళీ ప్రదేశాలు,అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు పట్టణాలు, గ్రామాల పరిధిలో ప్రజల రాకపోకలు తక్కువగా ఉండే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాడుబడిన భవనాల్లో ఎవరైనా తలదాచుకుంటున్నారా? అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను పరిశీలించి అవసరమైన చోట వివరాలు సేకరించారు.
నేరాల నివారణకు ముందస్తు చర్యలు
చోరీలు, అక్రమ కార్యకలాపాలు, ఇతర నేరాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాలపై నిఘాను మరింత పెంచేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.
ప్రజల సహకారం కోరిన పోలీసులు
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, జిల్లాలో నేరాల నియంత్రణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని బాపట్ల జిల్లా పోలీసులు తెలిపారు.












