ప్రజల ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

విద్యానగర్–గూడలి రహదారి మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ప్రజా వీక్షణం ప్రతినిధి శ్రావణ్ కుమార్ (సెప్టెంబర్ 03)

కోట మండలం విద్యానగర్ నుంచి గూడలి వరకు అస్తవ్యస్తంగా ఉన్న రహదారిపై ప్రజలు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి రహదారిపై జరుగుతున్న మరమ్మతు పనులను స్వయంగా పరిశీలించారు.విద్యానగర్ నుంచి గూడలి వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. ముఖ్యంగా గుంతలు, దెబ్బతిన్న రహదారి కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని తెలిపారు.ప్రజల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులు చేపట్టేలా అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల నాణ్యత, పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రహదారి మరమ్మతులు పూర్తయితే విద్యానగర్, గూడలి పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam