ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారం

గూడూరు: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఉద్దేశంతో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని గూడూరులో నిర్వహించారు.గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు, 4వ క్లస్టర్, 15వ యూనిట్ ఇంచార్జ్, మాజీ కౌన్సిలర్ తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ సూచనలతో ఈ కార్యక్రమాన్ని గూడూరు పట్టణంలోని 28వ వార్డు ఎగువ వీరారెడ్డిపల్లి 10వ బూత్ ఏరియాలో నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వ పథకాల ద్వారా వారికి అందుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడం ద్వారా ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి కుటుంబాన్ని కలిసి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ ప్రజలతో మమేకమవుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 28వ వార్డు ఉపాధ్యక్షుడు కోవూరు మురళి, 10వ బూత్ కో-కన్వీనర్ గంగలపూడి శ్రీనివాసులు, 28వ వార్డు కమిటీ మెంబర్ పరిమళ శ్రీనివాసులు, ఐటీడీపీ ప్రతినిధి అరుణ్ కుమార్, ఐటీడీపీ కార్యకర్తలు, టీడీపీ స్థానిక వార్డు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
గూడూరు ప్రజా వీక్షణం ప్రతి నిధి శ్రావణ్ కుమార్ సెప్టెంబర్ 03












