శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సి ఆర్ రెడ్డి కళ్యాణమండపం నందు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. గోపూజతో ప్రారంభమైన ఈ పోటీలు కృష్ణుడు వేషధారణలు గోపిక వేషధారణ పోటీలు శోభాయాత్ర తో పాటు సాంస్కృతిక పోటీలు జరిగాయి. వందలాది మంది చిన్నారులు పోటీలలో పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మురళి రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణ దర్శనం పోటీలు అంగరంగ వైభవంగా జరుపుతామన్నారు. శ్రీకృష్ణ తత్వాన్ని చిన్నారులకు చిన్న వయసులో బోధించాలన్నారు. అప్పుడే మన ధర్మం పట్ల నిష్ఠ పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆర్ఎస్ఎస్ నాయకులు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.












