పశుసంరక్షణకు మెరుగైన వసతులుకొత్తగుంటలో క్యాటిల్ షెడ్ ప్రారంభం

చిట్టమూరు, సెప్టెంబర్ 3 (ప్రజావిక్షణం):

గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు అన్నారు. మండలంలోని కొత్తగుంట గ్రామంలో నిర్మించిన క్యాటిల్ షెడ్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కిషోర్ నాయుడు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పశుపోషణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమన్నారు. పశువులను ఎండ, వర్షం నుంచి రక్షించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో సంరక్షించేందుకు క్యాటిల్ షెడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని సూచించారు.
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఆరూరు గిరినాయుడు, వీబీజీ రామ్‌జీ పథకం ఏపీవో, ఈసీ, టీఏ అధికారులు, స్థానిక నాయకులు పల్లం సుధాకర్, పాకాల పెంచలయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam