ల్యాంకో భవనాల్లో సంగం ఐటీఐ కళాశాల ఏర్పాటుకు చర్యలు

సంగం, సెప్టెంబర్ 3 (ప్రజా వీక్షణం ప్రతినిధి)

సంగం మండలం తరుణవాయి గ్రామ సమీపంలోని ల్యాంకో కంపెనీకి చెందిన భవనాలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచనల మేరకు ప్రస్తుతం ఆత్మకూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న సంగం ఐటీఐ కళాశాలను ఈ భవనాల్లోకి తరలించే అవకాశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసి, విద్యుత్, నీరు తదితర అన్ని మౌలిక వసతులు కల్పించి ఐటీఐ కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భవనాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.8 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు. మొదటి దశలో ఒక భవనాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, మొత్తం భవనాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చే ప్రక్రియ చేపడతామన్నారు.
ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను వినియోగించుకుని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఐటీఐ కళాశాలలో 120 మంది విద్యార్థులు, 11 మంది అధ్యాపకులు ఉన్నారని పేర్కొన్నారు. శాశ్వత భవనాల్లో కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా, శిక్షణ వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
కలెక్టర్ వెంట ఆర్డీవో పావని, ఇంజనీరింగ్ అధికారులు, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది ఉన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam