
గూడూరు: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాకతో కాలనీ వాసులు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.












