సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం

గూడూరు మండలం, సెప్టెంబర్ 5: గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శివాలయం ఎదురుగా ఉన్న ఇంటి నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు మట్టం మురళి వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది.సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై తిరుపతయ్య, వన్‌టౌన్ సీఐ శేఖర్‌బాబు పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమయంలో వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన మట్టం మురళిని స్థానికులు అభినందించారు.












