ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయంఘనంగా టీచర్స్ డే వేడుకలు

తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆలూరు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు కోసం విశేషంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులందరినీ శాలువాలతో సత్కరించి, బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆలూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు, వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, మంచి ఆలోచనా విధానాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని తెలిపారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప తత్వవేత్త, విద్యావేత్తగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని టీచర్స్ డేగా జరుపుకోవడం ఉపాధ్యాయ వృత్తికి, విద్యా రంగానికి ఇచ్చే గౌరవానికి ప్రతీక అని అన్నారు.
విద్యార్థుల విజయమే ఉపాధ్యాయులకు నిజమైన గుర్తింపు అని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా ఉపాధ్యాయులు నిరంతరం మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ఆకాంక్షించారు.టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి బహుమతులు అందజేయడం ద్వారా వారి సేవలను గౌరవించామని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో డీన్ చంద్రశేఖర్, ప్రైమరీంచార్జి దివ్య, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వెంకటగిరి .(ప్రజా వీక్షణం) ప్రతినిధి  సెప్టెంబర్ 05

error: Content is protected !!
Prajaveek Shanam