ప్రజా వీక్షణం ఉండవల్లి, సెప్టెంబర్ 5
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.ఎస్సీ, ఎస్టీల రక్షణకు అమలు చేస్తున్న చట్టాలు, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై సమావేశంలో సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అత్యాచారాల కేసుల్లో చట్టపరమైన చర్యలు, బాధితులకు అందుతున్న సహాయం తదితర అంశాలపై సమీక్ష జరిగినట్లు సమాచారం.ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు.












