గూడూరు ఏరియా ఆసుపత్రిలో సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రం ప్రారంభం
గూడూరు పట్టణం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఖరీదైన వైద్య పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఆధునిక పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని గూడూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అన్నారు.ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక వసతుల పథకం కింద గూడూరు ఏరియా ఆసుపత్రిలో రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చిన నూతన పరీక్ష కేంద్రం గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.గూడూరు ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి పనులు జరిగాయంటే అవి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపరచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 22 ఆరోగ్య కేంద్రాలను కేటాయించిందని, వాటిలో 10 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, 12 సమగ్ర ప్రజా ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వైద్య రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నాయని చెప్పారు.ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో ఆయా ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా గూడూరు ఏరియా ఆసుపత్రిలో సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
స్థానికంగానే ఆధునిక వైద్య పరీక్షలు
నూతనంగా ఏర్పాటు చేసిన సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రంలో ప్రజలకు అవసరమైన అనేక రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా థైరాయిడ్, క్యాన్సర్కు సంబంధించిన హార్మోన్ పరీక్షలు, గుండెకు సంబంధించిన వివిధ వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఇలాంటి పరీక్షల కోసం గతంలో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం గూడూరులోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు. గూడూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.
ప్రజలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన వైద్యం పొందితే అనేక సమస్యలను నియంత్రించవచ్చని అన్నారు.
ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
గూడూరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందులో భాగంగా రూ.16 లక్షలతో ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించామని, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.అలాగే ఆసుపత్రిలోని మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.33 లక్షలు కేటాయించి పనులు చేపట్టామని ఎమ్మెల్యే వివరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
రూ.21 కోట్లతో నూతన ఏరియా ఆసుపత్రి
గూడూరు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.21 కోట్ల వ్యయంతో నూతన ఏరియా ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భవనం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
నూతన ఆసుపత్రి అందుబాటులోకి వస్తే గూడూరు నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని అన్నారు. వైద్య రంగంలో అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలను పెంచుతూ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవలను మరింత విస్తరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రం ద్వారా అందుబాటులోకి వచ్చిన వైద్య పరీక్షల సదుపాయాలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కోరారు. గూడూరు ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా వీక్షణం .. 12 /9 /2026












