గూడూరులో మద్యం షాపుల లైసెన్స్‌ పునరుద్ధరణకు దరఖాస్తుల ఆహ్వానం

గూడూరు: 2026–27 సంవత్సరానికి గూడూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని A4 మద్యం షాపుల లైసెన్స్‌ల పునరుద్ధరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.ప్రస్తుతం అమలులో ఉన్న A4 మద్యం షాపుల లైసెన్స్‌లను 01-10-2026 నుంచి 30-09-2027 వరకు మరో ఏడాది కాలానికి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.గూడూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ పరిధిలో గూడూరు మున్సిపాలిటీలో 12 A4 షాపులు, చిల్లకూరు మండలంలో 6 A4 షాపులు కలిపి మొత్తం 18 A4 మద్యం షాపులు ఉన్నట్లు తెలిపారు. గీత కార్మికుల రిజర్వుడు కేటగిరీకి సంబంధించిన షాప్‌తో కలిపి మొత్తం 19 A4 షాపులు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

లైసెన్స్‌ ఫీజు వివరాలు:

ఓపెన్‌ కేటగిరీ: లైసెన్స్‌ ఫీజు – రూ.71.50 లక్షలు పర్మిట్‌ రూమ్‌ ఫీజు – రూ.7.50 లక్షలు రెన్యువల్‌ ఫీజు (38%) – రూ.27.20 లక్షలు

గీత కార్మికుల రిజర్వుడు కేటగిరీ: లైసెన్స్‌ ఫీజు – రూ.35.80 లక్షలు పర్మిట్‌ రూమ్‌ ఫీజు – రూ.7.50 లక్షలు రెన్యువల్‌ ఫీజు (38%) – రూ.13.60 లక్షలు

దరఖాస్తుల స్వీకరణ 12-09-2026 నుంచి ప్రారంభమైందని, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 21-09-2026 సాయంత్రం 5 గంటల వరకు అని అధికారులు తెలిపారు.
రెన్యువల్‌ ఫీజులో 38 శాతం మొత్తాన్ని ఒక విడతలోనే చెల్లించాలని, మిగిలిన లైసెన్స్‌ ఫీజును నాలుగు వాయిదాల్లో, పర్మిట్‌ రూమ్‌ ఫీజును మూడు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.లైసెన్స్‌ పునరుద్ధరణకు సంబంధించిన పూర్తి వివరాల కోసం గూడూరు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ప్రచురణ:- సెప్టెంబర్ 14 — ప్రజా వీక్షణం, గూడూరు

error: Content is protected !!
Prajaveek Shanam