బండ్లగూడలో దారుణ హత్య.. ఆటో డ్రైవర్‌పై కత్తులతో దాడి

సుప్రీమ్ వైన్స్ వద్ద 5–6 మంది దాడి.. తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే మృతి

బండ్లగూడ, ప్రజా వీక్షణం: బండ్లగూడలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. సుప్రీమ్ వైన్స్ సమీపంలో ఆటో డ్రైవర్, రౌడీషీటర్‌గా పోలీసులు గుర్తించిన **మొహమ్మద్ నయీమ్ (35–40)**పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నయీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 9:20 గంటల సమయంలో సుప్రీమ్ వైన్స్ వద్ద నయీమ్‌పై 5–6 మంది వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో తీవ్ర గాయాలై, అధిక రక్తస్రావం కావడంతో నయీమ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.మృతుడు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పాతకక్షల కారణంగానే హత్య జరిగిందా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.హత్యకు పాల్పడిన నిందితులు ఎవరు? ఘటనకు దారితీసిన కారణాలేమిటి? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.హత్య ఘటనతో బండ్లగూడలో ఒక్కసారిగా కలకలం రేగింది. జరిగిన సంఘటన పై  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam