20 వేల చాక్లెట్లతో గణనాథుడు.. నెల్లూరులో విశేష ఆకర్షణ

నెల్లూరు, ప్రజా వీక్షణం: వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఏకంగా 20 వేల చాక్లెట్లను ఉపయోగించి గణనాథుడి విగ్రహాన్ని రూపొందించడం విశేషంగా నిలిచింది.వివిధ రకాల చాక్లెట్లను సృజనాత్మకంగా అమర్చి వినాయకుడి ముఖం, కిరీటం, ఆభరణాలు, ఇతర అలంకరణలను తీర్చిదిద్దారు. రంగురంగుల చాక్లెట్లతో రూపొందించిన విగ్రహం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.వినాయకుడి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ ప్రత్యేక అలంకరణను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు చాక్లెట్లతో రూపొందించిన గణనాథుడిని చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.వినాయక చవితి వేడుకల్లో వినూత్నంగా 20 వేల చాక్లెట్లతో గణనాథుడిని రూపొందించడం నెల్లూరులో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.

error: Content is protected !!
Prajaveek Shanam