గణేష్‌ ఉత్సవ నిర్వాహకులకు ఘన సన్మాన

వెంకటగిరిలో ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

వెంకటగిరి, సెప్టెంబర్ 15, ప్రజా వీక్షణం:
వెంకటగిరి పట్టణంలో గణేష్‌ ఉత్సవాలను నిర్వహించిన మండపాల నిర్వాహకులను గణేష్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు గణేష్‌ జెండాలు, కండువాలు, బ్యానర్లను అందజేశారు.ఈ సందర్భంగా గణేష్‌ మండపాల నిర్వాహకులు హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించాలని సమితి సభ్యులు సూచించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

ఐక్యతతోనే ఉచిత విద్యుత్‌ సాధ్యం

గణేష్‌ ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించడంలో గణేష్‌ ఉత్సవ సమితి కీలక పాత్ర పోషించిందని సభ్యులు తెలిపారు. అందరి సహకారం, ఐక్యత వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైందన్నారు.భవిష్యత్తులో వెంకటగిరిలో గణేష్‌ శోభాయాత్రను మరింత వైభవంగా, సామూహికంగా నిర్వహించేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని సమితి సభ్యులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గణేష్‌ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు చావా రాంబాబు, అధ్యక్షులు విజయ్‌ కుమార్‌, కార్యదర్శి అలిమిలి మల్లికార్జున, రవీంద్ర, బెల్లంకొండ అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam