సంజూ విధ్వంసం.. వైభవ్‌కు దారులు క్లోజ్!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.మొదటి టీ20లో కేవలం 10 పరుగులకే ఔటైన సంజూపై విమర్శలు వచ్చాయి. మరోవైపు జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపించింది.అయితే రెండో టీ20లో సంజూ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఆరంభం అందించాడు. అభిషేక్ 19 బంతుల్లో 39 పరుగులు చేయగా, సంజూ 22 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. అనంతరం ఇషాన్ కిషన్ 38, తిలక్ వర్మ 15 పరుగులతో రాణించడంతో భారత్ 14.5 ఓవర్లలోనే 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సంజూ శాంసన్ తాజా ప్రదర్శనతో ఓపెనర్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నాడు. దీంతో మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కడం మరింత కష్టంగా మారినట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తుది జట్టు ఎంపికపై నిర్ణయం జట్టు మేనేజ్‌మెంట్‌దే.

error: Content is protected !!
Prajaveek Shanam