అంగన్‌వాడి కేంద్రంలో విద్యార్థులకు కుర్చీలు, విద్యా సామగ్రి వితరణ

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం పారిచర్ల రాజాపాలెం గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో విద్యార్థులకు కుర్చీలు, విద్యా సామగ్రి వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రోటేరియన్ కనుమర్లపూడి శ్రీనివాసరావు దాతగా వ్యవహరించారు.అంగన్‌వాడి కేంద్రం, ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కుర్చీలు, అవసరమైన విద్యా సామగ్రిని అందజేశారు. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించడం పట్ల పాఠశాల, అంగన్‌వాడి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ అధ్యక్షుడు . ఎన్. కృష్ణం రాజు మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్తు కోసం సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం రోటరీ క్లబ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే పాఠశాలలు, అంగన్‌వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు.విద్యార్థులకు మంచి విద్యా వాతావరణం కల్పిస్తే వారి భవిష్యత్తుకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.విద్య, వైద్యం, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎన్. కృష్ణం రాజు తెలిపారు.ఈ కార్యక్రమానికి గ్రామ అధ్యక్షుడు  వెంకటేశ్వర రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ కార్యదర్శి  ఎం. హరనాథ్ రెడ్డి, అంగన్‌వాడి టీచర్ కే. కవిత, టీచర్ జై కళ్యాణ్, బి. ధనుంజయ రెడ్డి, శ్రీనివాసులు, ఎం. సుబ్రహ్మణ్యం రాజు, ఏ. బలరాంరెడ్డి, ఎస్.కె. మహబూబా, సీడీపీఓ సుజనా, సూపర్‌వైజర్‌తో పాటు పాఠశాల, అంగన్‌వాడి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను అందించిన రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సభ్యులకు గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam