గోను శివకుమార్ అంతిమయాత్రలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

గూడూరు పట్టణం: శాంతినగర్‌లో స్వర్గస్థులైన సీనియర్ నాయకులు, రాష్ట్ర ఎస్సీ కమిటీ సభ్యులు గోను శివకుమార్ అంతిమయాత్ర కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గోను శివకుమార్ పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్.. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ కోసం గోను శివకుమార్ అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు.
అంతిమయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam