-టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు చెంచురామయ్య

క్యాండిల్స్ వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు
గూడూరు: ప్రజా వీక్షణం సెప్టెంబర్ 17
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆశీర్వాదిక దియా, సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు చెంచురామయ్య ఆధ్వర్యంలో క్యాండిల్స్ వెలిగించి ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మోదీ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని, గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం దేశ ప్రధానిగా చేపట్టిన పలు కార్యక్రమాలను, సాధించిన విజయాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి దేశ అభివృద్ధికి మరింతగా సేవలందించాలని ఆకాంక్షించారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు చెంచురామయ్య మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పలు రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావిస్తూ, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులపై భారతదేశం చేపట్టిన చర్యల్లో మోదీ నాయకత్వం కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. దేశ భద్రత, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు.కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి ఆవుల వెంకటేశ్వర్లు, వార్డు అధ్యక్షులు ముప్పాళ్ల వెంకట నరసరాజు, యూనిట్ కో-కన్వీనర్ వేమసాని మురళి నాయుడు, 12వ బూత్ కన్వీనర్ చెన్నుపల్లి సురేష్, 17వ బూత్ కన్వీనర్ పసుపులేటి సురేష్, యువ నాయకులు ఎగ్గిరెడ్డి వినయ్ కుమార్, బూత్ కో-కన్వీనర్ పులి శ్రావణ్ కుమార్, మూడుబోయిన ఆదయ్య, కొండూరు సుబ్రహ్మణ్యం రాజు తదితరులతో పాటు టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.













