సుమన్ ప్రజా దంత వైద్యశాలలో సీబీసీటీ పరికరం అందుబాటులోకి
వెంకటగిరి, సెప్టెంబర్ 24:
వెంకటగిరి పట్టణంలోని సుమన్ ప్రజా దంత వైద్యశాలలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కోన్ బీమ్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీబీసీటీ)–3డీ దంత ఎక్స్రే పరికరాన్ని గురువారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. అత్యాధునిక దంత వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం వెంకటగిరి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. చెన్నై, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆధునిక సాంకేతికతతో దంత వైద్యం అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. దంతాలు, దవడలకు సంబంధించిన సమస్యలను 3డీ ఇమేజింగ్ ద్వారా స్పష్టంగా గుర్తించి, మెరుగైన వైద్యం అందించేందుకు సీబీసీటీ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు.సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ.. వెంకటగిరి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలో రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్ల మేర నిధులు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, వైద్యం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మురుగ, మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరాందాసు గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, పట్టణ కమిటీ సభ్యులు, ఆసుపత్రి వైద్య బృందం, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.












