స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుదాం: నాగభూషణ్‌రెడ్డి
చౌడేపల్లి, సెప్టెంబర్ 24:
చౌడేపల్లి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు మండల పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. చౌడేపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో తాగునీటి సదుపాయాలు, సిమెంట్ రహదారులు, లింకు రోడ్ల నిర్మాణంతో పాటు బోయకొండ గంగమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.పదవులు కల్పించి ప్రజాసేవకు అవకాశం కల్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చౌడేపల్లి జడ్పీటీసీ దామోదర్‌రాజు, రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి రుక్మిణమ్మ, ఎంపీపీ గాజుల రామ్మూర్తి, ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కూరపర్తి అంజిబాబు, మండల అధ్యక్షుడు నాగభూషణ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జంగాలపల్లి వెంకటరమణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












