హేమన్య పుట్టినరోజు వేడుకల్లో సేవా స్ఫూర్తి

-బాలింతలకు పౌష్టికాహారం.. చిన్నారులకు దుస్తుల పంపిణీ

హేమన్య పుట్టినరోజు సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పౌష్టికాహారం, చిన్నారులకు దుస్తులు పంపిణీ చేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు.

ప్రజా వీక్షణం గూడూరు  సెప్టెంబర్ 26

పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో నిర్వహించి మానవతా స్ఫూర్తిని చాటుకున్నారు లయన్ పల్లమాల ప్రభాకర్–రమాదేవి దంపతులు. వారి కుమార్తె హేమన్య పుట్టినరోజు సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆసుపత్రి డెలివరీ వార్డులో చికిత్స పొందుతున్న బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అలాగే వారి చిన్నారులకు దుస్తులు, ఇతర అవసరమైన సామాగ్రిని అందజేశారు. పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని తల్లీబిడ్డలకు తమ వంతు సహాయం అందించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ, టౌన్, వెస్ట్ క్లబ్స్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు చిన్నారి హేమన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.లయన్ పల్లమాల ప్రభాకర్ మాట్లాడుతూ.. కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లీబిడ్డలకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. పుట్టినరోజు వేడుకలను కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం కంటే, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మరింత సంతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ ఎం.జె.ఎఫ్. లయన్ ఆర్.వి. రావు, వైజేపీ క్లబ్ అధ్యక్షుడు లయన్ పి. గోపినాథ్ రెడ్డి, కార్యదర్శి లయన్ లేడీ ఐ. కావేరి, టౌన్ క్లబ్ అధ్యక్షుడు లయన్ పి. ప్రసాద్, వెస్ట్ క్లబ్ అధ్యక్షుడు లయన్ ఇంతియాజ్, కార్యదర్శి లయన్ బి. శివ, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ టీం అడ్వైజర్ ఎం.జె.ఎఫ్. లయన్ పి. మురళి నాయుడు, యూత్ క్యాంపెయిన్ అండ్ ఎక్స్ఛేంజ్ ఎం. శ్రీనివాస్ యాదవ్,  పాస్ట్ ప్రెసిడెంట్లు లయన్ ఎస్.ఎల్.ఎన్. స్వామి, లయన్ బి. సుధాకర్, లయన్ డి. నరేంద్ర రెడ్డి, లయన్ షఫీ, లయన్ బి. హరి తదితరులుపాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam