
(ప్రజా వీక్షణం): సెప్టెంబర్ 30
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం హెచ్.ఎన్.పేట గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలకు చెందిన 150 మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.నిమ్మాడలోని శిబిర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని అభినందించిన మంత్రి, ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందని అచ్చన్నాయుడు తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నందున వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు టీడీపీ వైపు వస్తున్నారని పేర్కొన్నారు.పార్టీలో చేరిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు సముచిత గౌరవం, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజాసేవలో వారికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.కార్యక్రమంలో సీరపు నరసింహమూర్తి, సీరపు దశరథరావు, విజ్ఞ చిన్నారావు, పలివెల మనోహరరావు, గజిని భూపతి, కొజ్జెర్ల బాసుదేవరావు, కొజ్జెర్ల నరసింహం, దూపాన అప్పయ్య, బూడెపు బాబుజ్జి, పొలి రమణ, మైథిలై పోతయ్య తదితరులు టీడీపీలో చేరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












