గూడూరు పట్టణం: శాంతినగర్లో రాష్ట్ర ఎస్సీ కమిటీ సభ్యులు, దివంగత గోను శివకుమార్ ఉత్తరక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ హాజరయ్యారు.పెద్దలు నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి గోను శివకుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.












