రణ్‌వీర్‌తో కల్యాణి ప్రియదర్శన్‌.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ

అక్టోబరు 1 ప్రజా వీక్షణం

దక్షిణాదిలో ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణి ప్రియదర్శన్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. గత ఏడాది విడుదలైన ‘లోక ఛాప్టర్‌-1’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ప్రళయ్‌’ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుంది. జై మెహతా దర్శకత్వంలో ఈ సినిమా జాంబీ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.
యాక్షన్‌ కోసం ప్రత్యేక శిక్షణ
తొలి బాలీవుడ్‌ చిత్రంలోనే రణ్‌వీర్‌ సింగ్‌ సరసన నటించే అవకాశం రావడంతో కల్యాణి ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తన లుక్‌, ఫిట్‌నెస్‌తో పాటు యాక్షన్‌ నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా గత మూడు నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.
ముంబయిలోనే మకాం
సినిమా పూర్తయ్యే వరకు ముంబయిలోనే ఉండాలని కల్యాణి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి వర్క్‌షాప్స్‌, రిహార్సల్స్‌లో పాల్గొంటూ పాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ అరంగేట్రంతో ఉత్తరాదిలోనూ తన గుర్తింపును పెంచుకోవాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘ప్రళయ్‌’ చిత్రం అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. జాంబీ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

error: Content is protected !!
Prajaveek Shanam